శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 13:38:35

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసేందుకే బంగారం స్మ‌గ్లింగ్‌ !

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసేందుకే బంగారం స్మ‌గ్లింగ్‌ !

హైద‌రాబాద్‌: ఇటీవ‌ల కేర‌ళ‌లో జ‌రిగిన 30 కేజీల బంగారం స్మ‌గ్లింగ్ కేసును ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పోలీసులు ఓ భారీ కుట్ర‌ను చేధించే ప్ర‌య‌త్నం చేశారు. దౌత్య‌ప‌ర‌మైన మార్గాల్లో యూఏఈ నుంచి సుమారు 250 కిలోల బంగారం భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఆ బంగారాన్ని ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల కోసం వినియోగిస్తున్న‌ట్లు ఆ అధికారి అనుమానాలు వ్య‌క్తం చేశారు. భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసేందుకు ఈ ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు ఆ ఆఫీస‌ర్ తెలిపారు. ఈ కోణంలోనే కేసును విచారిస్తున్న‌ట్లు చెప్పారు. 

ఇప్ప‌టికే ఈ కేసుతో సంబంధం ఉన్న కేర‌ళ సీఎం మాజీ కార్య‌ద‌ర్శిని ఎన్ఐఏ విచారిస్తున్న‌ది. 30 కేజీల బంగారం స్మ‌గ్లింగ్‌ కేసుతో లింకు ఉన్న యూఏఈ దౌత్య కార్యాల‌య సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేసి ప్ర‌శ్నిస్తున్నారు. గ‌త ఏడాది జూలై నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 250 కేజీల బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేసిన‌ట్లు ఎన్ఐఏ అధికారి  అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇవాళ ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు.. స్వ‌ప్నా సురేశ్‌, సందీప్ నాయ‌ర్‌ల క‌స్ట‌డీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 24వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీని పొడిగించ‌నున్నారు. 24వ తేదీనే బెయిల్ అప్లికేష‌న్‌ను స్వీక‌రిస్తారు.  


logo