శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 09:13:02

అయోధ్య రామాల‌య భూమిపూజ‌కు 250 మంది అతిథులు

అయోధ్య రామాల‌య భూమిపూజ‌కు 250 మంది అతిథులు

హైద‌రాబాద్‌: వ‌చ్చే నెల 5వ తేదీన అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి భూమి పూజ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ వేడుక‌కు ప్ర‌ధాని మోదీ హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 250 మంది అతిథులు పాల్గోనున్నారు. అయోధ్య‌లోని సాధువులు, రామాల‌య ఉద్య‌మంతో సంబంధం ఉన్న సీనియ‌ర్ నేత‌లంతా భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు.రాష్ట్రీయ స్వయంసేవ‌క్ సంఘ్‌, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఆఫీసు బియ‌ర‌ర్లను కూడా శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ఆహ్వానించింది. కొంద‌రు సీనియ‌ర్ మంత్రులు, యూపీ మంత్రులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా స్వ‌ల్ప సంఖ్య‌లో అతిథుల‌ను ఈ కార్య‌క్రమానికి ఆహ్వానిస్తున్నారు. 

ఆగ‌స్టు 5వ తేదీన జ‌ర‌గ‌నున్న భూమి పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం పంపారు. ఆయ‌న హాజ‌రుకానున్నారు. ఆ రోజున ప్ర‌ధాని మోదీ ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కు అయోధ్య‌లో ఉంటారు.  భూమి పూజ‌ల‌కు సంబంధించిన‌  య‌జ్ఞ‌, హోమాలు ఆ రోజున ఉద‌యం 8 గంట‌ల‌కే ప్రారంభంకానున్నాయి. కాశీ, వార‌ణాసి నుంచి వ‌చ్చిన పూజారుల చేత శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు.  సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ జూలై 18న స‌మావేశం అయ్యింది. అయితే రామాల‌య నిర్మాణానికి సంబంధించి తేదీల‌ను ఆగ‌స్టు 3 లేదా 5కు ఖ‌రారు చేశారు.  



logo