బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 19:18:38

ధారవిలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు

ధారవిలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు

ముంబైలోని ధారవిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో మొత్తం కేసుల సంఖ్య 1378కు చేరుకుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మృతి కూడా నమోదు కాలేదని పేర్కొంది.

బలిగా నగర్, ధారవి క్రాస్ రోడ్, ఆజాద్ నగర్, కమలా నెహ్రూ నగర్, రాజివ్ గాంధీ నగర్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఈ కొత్త కేసులు నమోదైనట్లు బీఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే ముంబైలో 1411 పాజిటివ్ కేసులు నమోదు కాగా..43 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo