ఆదిలాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 1,91,417 వాహనాలు ఉన్నాయి. వీటి లో 1,48, 363 బైకలు, 9,072 కార్లు, 10,008 ఆటో రిక్షాలు, 2,8 06 వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, 1,010 టాక్సీ క్యాబ్‌లు, 6,306 గూడ్స్ వాహనాలు, 193 పాఠశాలల బస్సులు, 84 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు, 5, 767 వాణిజ్య అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లు, ట్రాలీలు, 24 హార్వెస్టర్లు, 84 అంబులెన్స్‌లు, 1,283 త్రీవీలర్ గూడ్స్ వెహికిల్స్, 6,414 ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించిన 59 రకాల సేవలను ఆన్లైన్లో అందిస్తున్నది. తమ కు అ వసరమైన పత్రాల జారీ కోసం మొదట మీ సేవ కేం ద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని వారు నిర్ణయించుకున్న సమయాల్లో రవాణా శాఖ కార్యాలయానికి హాజరు కావాలి. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు, పన్నులు, ఇతర పనుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి రావాలి. ఆఫీసు అధికారులు సిబ్బంది సంబంధిత పత్రాలను పరిశీలించడంతోపాటు డ్రైవింగ్ టెస్ట్‌లు, వాహనాల ఫిట్నెస్లు, ఇతర వాటిని పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం అన్ని ఉంటేనే వారు దరఖాస్తులో కోరిన పత్రాలను జారీ చేస్తారు.
ఆన్లైన్లోనే పత్రాలు జారీ..
రవాణా శాఖకు సంబంధించిన 18 రకాల సేవల కోసం కార్యాలయాలకు రాకుండానే ఆన్లైన్ పత్రాలు జారీ చేసే అవకాశం అధికారులు కల్పించారు. టీయాప్ ఫోలియో డౌన్లోడ్ చేసుకోవాలి. తాము పొందే సేవలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఆప్‌లోడ్ చేసి నిర్దేశించిన ఫీజు చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, లైసెన్స్‌లో అడ్రస్ మార్చ డం, లెర్నింగ్ లైసెన్స్‌లో వాహనస్థాయి మార్పులు, గడువు తీరిన లెర్నింగ్ లైసెన్స్ తిరిగి జారీ చేయడం, వాహన రిజిస్ట్రేషన్ పత్రంలో అడ్రస్ మార్పు, రాష్ట్రంలోని ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వాహనం బదిలీ, లెర్నింగ్ లైసెన్స్ డుప్లికేట్ జారీ, లైసెన్స్‌ను స్మార్ట్కార్డుగా మార్చడం, హిస్టరీ షీట్ లాంటి పత్రాలను పొందే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు వారు రవాణా శాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదు. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు, సిబ్బంది అన్ని సరిగా ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన పత్రాలను ఆన్లైన్లో పంపిస్తారు. దరఖాస్తుదారులు వీటిని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.