మంగళవారం 26 మే 2020
National - May 10, 2020 , 19:39:49

జ‌మ్మూకశ్మీర్ లో కొత్త‌గా 25 పాజిటివ్ కేసులు..

జ‌మ్మూకశ్మీర్ లో కొత్త‌గా 25 పాజిటివ్ కేసులు..

జ‌మ్మూకశ్మీర్ : జ‌మ్మూకశ్మీర్ లో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే కొత్త‌గా 25 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  ఈ కేసుల్లో క‌శ్మీర్ డివిజ‌న్ లో  23 కేసులు న‌మోదు కాగా..జ‌మ్మూలో రెండు న‌మోదయ్యాయి. 

తాజా కేసుల‌తో జ‌మ్మూక‌శ్మీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 861కు చేరుకుంద‌ని ఉన్న‌తాధికారి ఒక‌రు  వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు 9 మంది మృతి చెందారు. మ‌రోవైపు జ‌మ్మూక‌శ్మీర్ లో లాక్ డౌన్ కొన‌సాగుతుంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo