గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 09:53:53

భారత్ లో 258 కరోనా కేసులు నమోదు..

భారత్ లో 258 కరోనా కేసులు నమోదు..

న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ భారత్ లో చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 258 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో నిన్న ఒక్క రోజే 55 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 18 రాష్ర్టాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఢిల్లీ, పంజాబ్‌, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. నిన్న ముగ్గురిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో 53, కేరళలో 40, ఉత్తరప్రదేశ్‌లో 23, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో 17, కర్ణాటక 16, లడఖ్‌ 10, కేరళలో 12, హిమాచల్‌ ప్రదేశ్‌లో రెండు, బెంగాల్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 


logo
>>>>>>