బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 14:00:11

కరోనాతో 200 మందికిపైగా పోలీసులు మృతి

కరోనాతో 200 మందికిపైగా పోలీసులు మృతి

ముంబై: మహారాష్ట్రలో కరోనాతో 200 మందికిపైగా పోలీసులు మరణించారు. ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 247 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసు సిబ్బంది సంఖ్య 20,003కు చేరింది. ఇప్పటి వరకు 16,071 మంది కోలుకోగా ప్రస్తుతం 3,728 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో వైరస్ వల్ల మరణించిన పోలీసుల సంఖ్య 204కు చేరింది. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11 లక్షలు, మరణాల సంఖ్య 30 వేలు దాటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo