బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 12:47:07

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి జిల్లాలోని కోట లాల్‌సోట్‌ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సాయంతో బస్సును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మృతదేహాలను బయటకు వెలికితీస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 28 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది పురుషులు, 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


logo