గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 13:37:42

ఢిల్లీలో నిత్యావసర దుకాణాలు 24 గంటలు

ఢిల్లీలో నిత్యావసర దుకాణాలు 24 గంటలు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో కొన్నిరాష్ర్టాల్లో నిత్యావసరాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఢిల్లీలో మరీ ఎక్కువ. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. నిత్యావసర వస్తువలు విక్రయించే దుకాణాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ జైజాల్‌, సీఎం ఏ కేజ్రీవాల్‌ డిజిటల్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైందని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరిందన్నారు.

పాలు, కూరగాయలు, కిరాణా సామగ్రి వంటి నిత్యావసర సరకులు విక్రయించే దుకాణాలు ఇకపై నిత్యం అందుబాటులో ఉంటాయని, సరిపడా నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంటా ఇండ్లకే పరిమితమయ్యారని, అయినా మరిన్న చర్యలు అవసరమని తెలిపారు. మొహల్లా క్లినిక్‌లో వైద్యుడికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ తేలిందని, కరోనా బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తాన్నారు. 


logo