గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 13:40:24

24 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

24 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

అగర్తలా: భారత రక్షణ దళాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. త్రిపురలోని సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్‌) 86వ బెటాలియన్‌కు చెందిన 24 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో త్రిపురలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88కి చేరిందని ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేబ్‌ ప్రకటించారు. ధలాయ్‌ జిల్లాలోని అంబాస్సాలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ 86వ బెటాలియన్‌ ప్రధాన కేంద్రంలో ఈ కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 

రాష్ట్రంలో మొత్తం 88 కరోనా కేసులు నమోదవగా, అందులో 86 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, ఇద్దరు కోలుకున్నారని ఆయన తెలిపారు.


logo