బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 20:49:09

ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 61 మ‌ర‌ణాలు

ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 61 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీని క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. గురువారం ఒక్క‌రోజే క‌రోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా 2373 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి కోలుకున్న 3015 మంది గురువారం డిశ్చార్జి అయ్యారు. దేశ రాజ‌ధానిలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,175కు చేరింది. మ‌ర‌ణాల సంఖ్య 2,864. ఇక గురువారం రోజు 20,822 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 10,978 ఆర్టీపీసీఆర్ టెస్టులు కాగా, 9,844 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు. 


logo