ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:37:11

మరో 236 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మరో  236 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్ర పోలీస్‌శాఖలో కరోనా వైరస్‌ బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకి పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గడచిన 24 గంటల్లో మరో 236 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరొకరు చనిపోవడంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 98కు చేరింది. మహారాష్ట్రలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 8958కు చేరింది.  ఇప్పటి వరకు 6,962 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,898 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo