ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 11:09:54

24 గంటల్లో 232 మంది పోలీసులకు కరోనా

24 గంటల్లో   232 మంది పోలీసులకు కరోనా

ముంబై:  మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ  ఆందోళన కలిగిస్తున్నది.  గడచిన 24 గంటల్లో మరో 232  మంది పోలీసు సిబ్బందికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఉన్నతాధికారులు తెలిపారు. తాజాగా  మరొకరు మృతిచెందడంతో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన పోలీసు సిబ్బంది సంఖ్య 9449కు పెరిగింది. ఇప్పటి వరకు 7,414 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,932 యాక్టివ్‌ కేసులున్నాయి. 


logo