బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 15:22:28

బీహార్‌లో కొత్తగా 231 కరోనా కేసులు

బీహార్‌లో కొత్తగా 231 కరోనా కేసులు

పాట్నా : బీహార్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 231 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 10,914కు చేరింది. 8,020మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జికాగా 77మంది మృతి చెందారు.  ఇదిలాఉండగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేలల్లో నమోదువుతున్నాయి. ఇప్పటివరకు 6,25,544 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇందులో 2,27,439 యాక్టివ్‌ కేసులున్నాయి. 3,79,892మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జికాగా ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 18,213మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ  తన నివేదికలో వెల్లడించింది.logo