ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 07:08:42

23 కొత్త హైవేలు.. 2025నాటికి నిర్మాణం పూర్తి

23 కొత్త హైవేలు.. 2025నాటికి నిర్మాణం పూర్తి

న్యూఢిల్లీ: దేశంలో 2025 నాటికి 23 కొత్త జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం పూర్తిచేయాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ఢిల్లీ-ముంబై, అహ్మదాబాద్‌-ధొలేరా, అమృత్‌సర్‌-జామ్‌నగర్‌ తదితర నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం 2023 నాటికి పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 7,800 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి రూ.3.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని స్టేటస్‌ రిపోర్టులో అంచనావేసింది. ఎక్స్‌ప్రెస్‌ వేలు సూరత్‌, సోలాపూర్‌, లక్నో, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాయ్‌పూర్‌, కోటా, ఖరగపూర్‌, సిలిగురిని కలుపుతాయి. హైదరాబాద్‌-విశాఖపట్నం-ఇండోర్‌-రాయ్‌పూర్‌ మార్గాన్ని 2025 నాటికి పూర్తిచేస్తారు. ఈ రహదారుల వెంట భారీ ఎత్తున ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తారు.  


logo