సోమవారం 01 జూన్ 2020
National - May 16, 2020 , 07:50:10

లారీలు ఢీకొని.. 24 మంది వలస కూలీల మృతి

లారీలు ఢీకొని.. 24 మంది వలస కూలీల మృతి

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న ట్రక్కు శనివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఔరయ వద్ద మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇందులో బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.   

కరోనా లాక్‌డౌన్‌తో వలస కూలీల వెతలు తీవ్రమయ్యాయి. పొట్టకూటి కోసం వేలాది మంది కూలీలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లార్‌. లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో వారి స్వస్థలాలకు బయల్దేరు. ఇలా వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాల బారినపడి మరణిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్సురైలు వెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు కాలినడకన వెళ్తున్న ఓ యువకుడు వడదెబ్బ తగలడంతో భద్రాచలంలో మరణించాడు.   

ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.  


logo