ఆదివారం 20 సెప్టెంబర్ 2020
National - Aug 16, 2020 , 14:07:08

రూ.9 లక్షల డ్రగ్స్‌ స్వాధీనం.. 23 మంది అరెస్టు

రూ.9 లక్షల డ్రగ్స్‌ స్వాధీనం.. 23 మంది అరెస్టు

వాగేటర్‌:  ఉత్తర గోవా వాగేటర్‌లోని ఓ విల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేసి రూ. 9 లక్షల విలువైన మాదక ద్రవ్యాలతోపాటు ముగ్గురు విదేశీయులతో సహా 23 మందిని అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి వాగేటర్‌ ప్రాంతంలో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో ఇన్‌స్పెక్టర్‌ రాహుల్ పరాబ్ నాయకత్వంలో నారాయణ్ చిముల్కర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌ రిమానాయక్, సంధ్య గుప్తా బృందాలు సిబ్బందితో కలిసి విల్లాపై దాడి చేసి 23 మందిని అరెస్టు చేసినట్లు క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్పీ శోబిత్ సక్సేనా తెలిపారు. వీరి నుంచి కొకైన్, ఎండీఎంఏ, ఎక్ట్ససీ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ .9 లక్షలకు పైగా ఉంటుందని, ప్రజా భద్రతా, మాదకద్రవ్యాల నిషేధ చట్టం ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సక్సేనా వెల్లడించారు.


logo