శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 27, 2020 , 22:46:41

మహారాష్ట్రలో కరోనా విలయం

మహారాష్ట్రలో కరోనా విలయం

ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మృతుల సంఖ్య అదేస్థాయిలో ఉంటుండడంతో జనాలు హడలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 7,924 కేసులు నమోదు కాగా 227 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,83,723 మంది కరోనా బారినపడగా 2,21,944 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

1,47,592 వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా ఇవాళ 8706 మంది రోగులు డిశ్చార్జి కాగా రాష్ట్రంలో రికవరీ రేటు 57.84 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవాళ ముంబైలో 1,033 కరోనా కేసులు నమోదు కాగా 39 మంది మృతి చెందారు. గ్రేటర్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 1,10,129 కేసులు నమోదు కాగా 81,944 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య  సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.logo