మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:40

వారంలో మృతుల సంఖ్య 2266

వారంలో మృతుల సంఖ్య 2266

  • 3.20 లక్షలు దాటిన కరోనా కేసులు
  • ప్రతిరోజూ కొత్త కేసులు 10 వేల పై మాటే
  • 50.60 శాతానికి రోగుల రికవరీ 

న్యూఢిల్లీ, జూన్‌ 14: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. పాజిటివ్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గత వారంలో కొవిడ్‌-19 బారిన పడి 2266 మంది మరణించారు. గత 3 రోజుల్లోనే వెయ్యి మంది చనిపోయారు. దేశవ్యాప్త మరణాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీల్లోనే మూడింట రెండొంతులు నమోదయ్యాయి.   

కొత్త కేసులు 11,926

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గత 24 గంటల్లో 11,929 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. గత 24 గంటల్లో మరో 311 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 9,195కు చేరింది. కోలుకునే రోగుల సంఖ్య 50.60 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ  తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్త మృతుల్లో భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నది. 

ఢిల్లీలో ఇంటింటా సర్వే: అమిత్‌షా 

ఢిల్లీలో సోమవారం నుంచి హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ‘ఇంటింటి’ సర్వే చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. దేశ రాజధానిలో పరిస్థితిపై ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఢిల్లీలో వైద్య పరీక్షలు సోమవారం నుంచి రెండు రోజుల్లో రెట్టింపు చేస్తామని, తర్వాత 6 రోజులకు 3 రెట్లకు పెంచుతామన్నారు.  బెడ్ల కొరత నేపథ్యంలో 500 రైల్వే కోచ్‌లను పూర్తి వసతులతో ఢిల్లీ ప్రభుత్వానికి తక్షణం అందజేయాలని రైల్వేశాఖను ఆదేశించారు. నగరంలో కరోనా చికిత్సకు అవసరమయ్యే బెడ్లు  5000లకు పెంచుతామని ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ తెలిపారు.  

ఏడు రోజుల్లో మృతుల పెరుగుదల

తేదీ 
మృతులు
జూన్‌ 7
6,929
జూన్‌ 8
7,200
జూన్‌ 9
7,466
జూన్‌ 10
7,745
జూన్‌ 11
8,102
జూన్‌ 12
8498
జూన్‌ 13
8,894
జూన్‌ 14
9,195


logo