ఆదివారం 24 జనవరి 2021
National - Jan 04, 2021 , 13:29:32

లీలా ప్యాలెస్‌ హోట‌ల్‌లో 22 మందికి క‌రోనా పాజిటివ్‌

లీలా ప్యాలెస్‌ హోట‌ల్‌లో 22  మందికి క‌రోనా పాజిటివ్‌

చెన్నై‌:  త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని లీలా ప్యాలెస్ ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో 20 మంది సిబ్బందికి క‌రోనా పాజిటివ్ న‌మోదు అయ్యింది. ఇటీవ‌లే ఆ న‌గ‌రంలో ఐటీసీ గ్రాండ్ చోలా హోట‌ల్‌లో కూడా భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పుడు మ‌ళ్లీ భారీ స్థాయిలో ఓ హోట‌ల్‌లో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇది రెండ‌వ‌సారి. ఐటీసీ హోట‌ల్ సిబ్బంది, వారి కుటుంబ‌స‌భ్యుల్లో 85 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు శ‌నివార‌మే తేలింది. ప్రామాణిక నిబంధ‌న‌లు పాటిస్తున్నా త‌మ‌కు వైర‌స్ సోకిన‌ట్లు హోట‌ల్ సిబ్బంది పేర్కొన్న‌ది.  లీలా ప్యాలెస్ హోట‌ల్‌లో 232 మంది సిబ్బందికి క‌రోనా టెస్టింగ్ చేశారు. దాంట్లో ప‌ది శాతం మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. చెన్నై న‌గ‌రంలో ఉన్న హోట‌ళ్ల‌లో సుమారు 6416 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 68 శాతం మంది సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.  


logo