మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 08:46:21

ప్రపంచస్థాయి శాస్త్రవేత్తల జాబితాలో గువాహటి ఐఐటీ పరిశోధకులు

ప్రపంచస్థాయి శాస్త్రవేత్తల జాబితాలో గువాహటి ఐఐటీ పరిశోధకులు

గువాహటి: ప్రపంచంలోనే అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో అసోంలోని గువాహటి ఐఐటీకి చెందిన 22 మంది అధ్యాపకులు, పరిశోధకులకు చోటు దక్కింది. ఇందులో ఐఐటీ గువాహటి డైరెక్టర్‌ టీజీ సీతారాం కూడా ఉన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రపంచంలోనే అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో లక్ష మందికి పైగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు సమర్పించిన పరిశోధనా పత్రాల ఆధారంగా స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ దీనిని రూపొందించింది. ఈ జాబితాలో తమ పరిశోధకులు, అధ్యాపకులు చోటు దక్కించుకోవడం ఐఐటీ గువాహటికి గర్వకారణం అని టీజీ సీతారాం పేర్కొన్నారు.