గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 19:04:57

పిడుగులు ప‌డి 22 మంది మృతి

పిడుగులు ప‌డి 22 మంది మృతి

ప‌ట్నా: బీహార్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌తిరోజూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన జ‌ల్లులు ప‌డుతున్నాయి. గురువారం ఒక్క‌రోజే పిడుగుపాటుకు గురై 22 మంది  మరణించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. బీహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులుప‌డి 22 మంది మ‌ర‌ణించార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 

జిల్లాల వారీగా ఏయే జిల్లాలో ఎంత‌మంది మ‌ర‌ణించార‌నే వివ‌రాల‌ను జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం వెల్ల‌డించింది. అసమ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయి స‌హా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క‌రు చొప్పున పిడుగుపాట్ల‌తో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కాగా, బీహార్‌లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


logo