బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 19:36:04

బీహార్‌లో మ‌ళ్లీ పిడుగుల బీభ‌త్సం.. 22 మంది మృతి

బీహార్‌లో మ‌ళ్లీ పిడుగుల బీభ‌త్సం.. 22 మంది మృతి

ప‌ట్నా: బీహార్‌లో మ‌రోసారి విషాదం చోటుచేసుకుంది. ఇటీవ‌ల ఆ రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలతోపాటు పిడుగులు ప‌డి ఒకేరోజు 83 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే మ‌ళ్లీ అలాంటి ఘోరమే జ‌రిగింది. గురువారం ఉద‌యం నుంచి ఉరుములు, మెరుపుల‌తో బీహార్ అంత‌టా వాన‌లు కురిశాయి. ఈ సంద‌ర్భంగా ప‌లుచోట్ల పిడుగులు బీభ‌త్సం సృష్టించాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు ప‌డి ఒక్క‌రోజే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కాగా, ఈ విషాద‌క‌ర‌ ఘ‌ట‌న‌ల‌పై బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్య‌క్తంచేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలియ‌జేశారు. పిడుగుపాట్ల‌కు బ‌లైన 22 మంది కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. కాగా, గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గ‌త 10 రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపు 120 మంది పిడుగుపాట్ల‌కు బ‌లికావ‌డంతో బీహార్ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ‌  logo