మంగళవారం 19 జనవరి 2021
National - Dec 24, 2020 , 11:01:36

బ్రిట‌న్ ప్ర‌యాణికుల్లో 22 మందికి క‌రోనా పాజిటివ్

బ్రిట‌న్ ప్ర‌యాణికుల్లో 22 మందికి క‌రోనా పాజిటివ్

న్యూఢిల్లీ : గ‌త కొన్ని రోజులుగా బ్రిట‌న్ నుంచి భార‌త్ వ‌చ్చిన ప్ర‌యాణికుల్లో 22 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది.  ఢిల్లీలో 11 మంది, అమృత్‌స‌ర్‌లో 8 మంది, కోల్‌క‌తాలో ఇద్ద‌రు, చెన్నైలో ఒక‌రు పాజిటివ్‌గా తేలారు. బ్రిట‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చిన ప్ర‌యాణికులంద‌రికీ ఆయా విమానాశ్ర‌యాల్లో ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆ ప‌రీక్ష‌ల ఫ‌లితాల కోసం ప్ర‌యాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే ఉన్నారు. వీరంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొంద‌రి న‌మూనాలను పుణెలోని నేష‌న‌ల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ల్యాబ్‌కు పంపారు. కొత్త రకం క‌రోనా వైర‌స్ తీవ్ర‌త స్థాయిని తెలుసుకునేందుకు ప‌రిశోధ‌కులు య‌త్నిస్తున్నారు. గ‌త నాలుగు వారాల్లో యూకే నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల‌ను అధికారులు గుర్తించి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఇక క‌ర్ణాట‌క‌తో పాటు ముంబై న‌గ‌రంలో నైట్ క‌ర్ఫ్యూను విధించారు. దేశంలో గత 24 గంట‌ల్లో కొత్త‌గా 23,950 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.01 కోట్ల‌కు చేరింది.