శనివారం 06 జూన్ 2020
National - May 20, 2020 , 21:27:25

ఢిల్లీలో చిక్కుకున్న 22 మంది విద్యార్థినిలు..

ఢిల్లీలో చిక్కుకున్న 22 మంది విద్యార్థినిలు..

న్యూఢిల్లీ: లాక్‌ డౌన్‌ తో 22 మంది విద్యార్థినిలు మార్చి నుంచి ఢిల్లీలో చిక్కుకున్నారు. అసోం, మేఘాలయ, నాగాలాండ్‌ కు 22 మంది విద్యార్థినులు హిమాచల్‌ ప్రదేశ్‌ లోని పాలంపూర్‌ స్కూల్‌ లో చదువుతున్నారు. 

విద్యార్థినిలతోపాటు ఉన్న  అధికారిణి శీతల్‌ మాట్లాడుతూ.. పరీక్షలు పూర్తయిన తర్వాత ఢిల్లీ-గౌహటి రైలులో ఇండ్లకు బయలుదేరాం. అయితే ఢిల్లీకి రాగానే రైలు రద్దయినట్లు తెలిసింది. దీంతో ఆ రోజు రైల్వేస్టేషన్‌ లోనే ఉన్నాం. తర్వాత రోజు జనతా కర్ఫ్యూ విధించడం, లాక్‌ డౌన్‌ ప్రారంభం కావడంతో ఢిల్లీలో ఉండిపోయాం. మాకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందజేదని, తమను సొంతూళ్లకు పంపించాలని కోరారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo