శనివారం 28 మార్చి 2020
National - Mar 20, 2020 , 17:35:44

21 కిలోల బంగారం సీజ్‌..

21 కిలోల బంగారం సీజ్‌..

కోల్‌కతా: కోల్‌కతాలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని బొంగావ్‌కు సమీపంలోబంగ్లాదేశ్‌ కు చెందిన కొందరు వ్యక్తులు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో..బీఎస్‌ఎఫ్‌ అధికారులు, డీఆర్‌ఐ టీం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో 21 కిలోల బంగారాన్ని అధికారుల బృందం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిరిగిన బట్టలు, టేపుల్లో దాచిన 23 ప్యాకెట్లను గుర్తించి...పరిశీలించగా వాటిలో 95 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. నాలుగు ప్రదేశాల్లో బంగారాన్ని గుర్తించినట్లు డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు. 


logo