లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆంజనేయుడి పెళ్లెప్పుడు అంటే రేపు అన్నట్టు ఇప్పుడు నయనతార పెళ్లి మేటర్ కూడా అలానే మారింది. ఈ ఏడాది నయనతార పెళ్లంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం నడిచింది. కాని తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ అమ్మడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట.దీనిపై విఘ్నేష్ ఫ్యామిలీ కాస్త అసంతృప్తిగానే ఉన్నారని టాక్.
శింబు, ప్రభుదేవాకు బైబై చెప్పిన తర్వాత నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతుంది. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేయడం, కలిసి పండుగలు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియుడి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తుంది నయనతార. విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తున్నాడు.