బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 18:34:37

21 రాష్ట్రాల్లో కొత్త కేసుల కంటే‌ కోలుకున్న‌వారే ఎక్కువ: కేంద్రం

21 రాష్ట్రాల్లో కొత్త కేసుల కంటే‌ కోలుకున్న‌వారే ఎక్కువ: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో‌ క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా ఆ 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త‌గా న‌మోద‌య్యే కేసుల కంటే రిక‌వ‌రీ అయ్యేవారు ఎక్కువ‌గా ఉంటున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, హ‌ర్యానా, జ‌మ్ము & క‌శ్మీర్‌, ఒడిశా, పంజాబ్‌, మేఘాల‌యా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఉన్నాయ‌ని ఆరోగ్య‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ చెప్పారు.

అదేవిధంగా, గ‌త కొన్ని రోజులుగా దేశంలో న‌మోద‌వుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల స‌గ‌టు 90 వేలుగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 92,043 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. 88,600 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారి సంఖ్య 49,41,627కు చేరింద‌ని, మొత్తం కేసుల‌లో రిక‌వ‌రీ రేటు 82.46 శాతంగా ఉంద‌ని ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.             

‌లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo