ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 08:09:54

కొత్త‌గా 21 క‌రోనా పాజిటివ్ కేసులు..

కొత్త‌గా 21 క‌రోనా పాజిటివ్ కేసులు..

రాంఛీ: జార్ఖండ్ లో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 21 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 153కు చేరింద‌ని రాజేంద్ర ఇనిస్టిట్యూట్  ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ డైరెక్ట‌ర్ డీకే సింగ్ తెలిపారు.

క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మూడో ద‌శ లాక్ డౌన్ ముగిసే వ‌ర‌కూ రాష్ట్రంలో ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌వ‌ని సీఎం హేమంత్ సోరెన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అత్య‌వ‌స‌రం కాకున్నా రోడ్ల‌పైకి వ‌స్తున్న‌వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo