శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 16:28:36

యూపీలో మ‌రో 21 మందికి క‌రోనా

యూపీలో మ‌రో 21 మందికి క‌రోనా

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్న‌ది. శుక్ర‌వారం కొత్త‌గా మ‌రో 21 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు యూపీలో న‌మోదైన‌ మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 431కి చేరింది. వారిలో 225 మంది గ‌త నెల ఢిల్లీలో త‌బ్లిగీ జ‌మాత్ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారేన‌ని అధికారులు తెలిపారు. కాగా, కొవిడ్‌-19 కార‌ణంగా యూపీలో ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురు మృతిచెందారు. వారిలో మీర‌ట్‌, బ‌స్తి, వార‌ణాసి, ఆగ్రా ప్రాంతాల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo