సోమవారం 13 జూలై 2020
National - Jun 29, 2020 , 10:47:29

21 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా

21 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌ భద్రతా దళాలను కూడా వణికిస్తున్నది. సరిహద్దు రక్షక దళం (బీఎస్‌ఎఫ్‌)లో ఈ వైరస్‌ బారినపడుతున్న వారిసంఖ్య క్రమంగా పెరగుతున్నది. గత 24 గంటల్లో 21 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా సోకింది. దీంతో బీఎస్‌ఎఫ్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 965కి చేరింది. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు 655 మంది కోలుకోగా, 305 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో ఐదుగురు మరణించారు. నిన్న 33 మంది జవాన్లు కరోనా పాజిటివ్‌లుగా తేలారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,48,318 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 16,475 మంది మరణించారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19459 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 3,21,723 మంది బాధితులు కోలుకోగా, 2,10,120 మంది చికిత్స పొదుతున్నారు. 


logo