శనివారం 30 మే 2020
National - May 23, 2020 , 17:19:05

BSFలో మరో 21 మంది జవాన్లకు కరోనా

BSFలో మరో 21 మంది జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్సు (BSF)లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా శనివారం మరో 21 మంది BSF జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు BSF అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గత 24 గంటల్లో BSFలో కొత్తగా 21 మంది జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారు అందరినీ గుర్తింపు పొందిన కొవిడ్‌-19 హెల్త్‌కేర్‌ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. కాగా శనివారం నమోదైన 21 కేసులతో కలిపి బీఎస్‌ఎఫ్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 406కు చేరింది. అయితే, వారిలో 286 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 120 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


logo