బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 19:06:35

క‌ల్తీ మ‌ద్యం సేవించి 21 మంది మృతి

క‌ల్తీ మ‌ద్యం సేవించి 21 మంది మృతి

అమృత్‌స‌ర్‌: పంజాబ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మ‌ద్యం సేవించి ఆ రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌త 48 గంట‌ల వ్య‌వ‌ధిలో అమృత్‌స‌ర్‌, గురుదాస్‌పూర్‌, తార‌న్ త‌ర‌న్ ప్రాంతాల్లో ఈ మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో మ‌రికొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రుల పాల‌య్యారు. కాగా, ఆ ఘ‌ట‌న‌ల‌ గురించి తెలిసి పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ఆ ఘ‌ట‌న‌ల‌పై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

'అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తారన్ తరన్ ప్రాంతాల్లో కల్తీ కల్లు మరణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. జలంధర్ డివిజన్‌కు చెందిన ఉన్నతాధికారులు ఈ ఘ‌ట‌న‌ల‌పై విచారణ జ‌రుపుతున్నారు‌. బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని సీఎం అమరీందర్ సింగ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo