హీరో బర్త్‌డే వస్తుందంటే మేకర్స్ పోస్టర్స్ లేదా వీడియోలతో అభిమానులని అలరించే ప్రయత్నం చేస్తుంటారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే కాగా, ఓ రోజు ముందే అభిమానులని ఆనందింపజేసేందుకు ఆర్ఆర్ఆర్ నుండి స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు. రామరాజుగా రామ్ చరణ్ కొత్త అవతారం చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో చరణ్‌కు సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాను షేక్ చేసింది.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, ఆయన సరసన కథానాయికగా అలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ చిత్రంలో కొమురం భీంగా కనిపించనున్నారు. కాల్పనిక గాథ ఆధారంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఆచార్య చిత్రంలోను రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించగా ఆ పాత్రకు సంబంధించిన పోస్టర్ రేపు విడుదల చేయనున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంతో బిజీగా ఉన్నారు.