ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 21:27:56

జమ్మూకశ్మీర్‌లో 204 కరోనా పాజిటివ్‌ కేసులు

జమ్మూకశ్మీర్‌లో 204 కరోనా పాజిటివ్‌ కేసులు

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో శనివారం 204 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,966కు చేరగా, మృతుల సంఖ్య 93కు చేరాయని అధికారులు తెలిపారు. ఇవాళ నమోదైన 204 కేసుల్లో 13 జమ్మూ డివిజన్‌లో, 191 మంది కశ్మీర్ డివిజన్‌కు చెందిన వారని వివరించింది. రాష్ట్రంలో 2,648మంది చికిత్స పొందుతుండగా, 4,255 మంది కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో దేశంలో 18,552 కరోనావైరస్ కేసులు నమోదు కాగా, శనివారం 5 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం 1,97,387 యాక్టివ్‌ కేసులుండగా, 2,95,880 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు.


logo