‘సీఎం అయిన మీకు.. అరెస్ట్ వారెంట్ ఎవరిస్తారు..’

న్యూఢిల్లీ: సీఎం అయిన మీకు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ఎవరు జారీ చేస్తారని బీఎస్ యెడియూరప్పను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ఆయనతోపాటు పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మురుగేష్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. అయితే పాత కేసును నెల రోజుల్లో పునరుద్ధరించాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాన్ని పక్కనపెట్టేందుకు నిరాకరించింది. 2011లో కర్ణాటకలో పరిశ్రమ ఏర్పాటుకు ఒక ప్రైవేట్ సంస్థకు 26 ఎకరాల భూమిని ఇస్తామని నాటి యెడియూరప్ప ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కాగా, ఆమోదించిన స్థలాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడంపై పారిశ్రామిక వేత్త ఆలం పాషా కోర్టును ఆశ్రయించారు. సీఎం యెడియూరప్ప, నాటి పరిశ్రమల మంత్రి మురుగేష్ నిరానీ, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ వీపీ బలిగర్, కర్ణాటక ఉద్యోగ్ మిత్రా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కె శివస్వామికి వ్యతిరేకంగా నేరపూరిత కుట్ర, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు చేశారు. 2016లో సిటీ సివిల్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ కేసును నెల రోజుల్లో పునరుద్ధరించాలని జనవరి 6న ఆదేశించింది.
బీఎస్ యెడియూరప్పతోపాటు, మాజీ మంత్రి మురుగేష్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే వీరి పిటిషన్పై బుధవారం విచారణ జరిపారు. ‘మీరు సీఎం.. మీకు వ్యతిరేకంగా ఎవరు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. అయితే కేసు పునరుద్ధరణ నేపథ్యంలో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉన్నదని మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో యెడియూరప్పతోపాటు మురుగేష్కు అరెస్ట్ నుంచి కోర్టు రక్షణ ఇచ్చింది. అయితే కేసు పునరుద్ధరణనకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కల్పించుకోబోమని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- జహీరాబాద్ అభివృద్ధిపై మంత్రి హరీశ్ సమీక్ష
- జనగామ జిల్లాలో సర్పంచ్ సస్పెండ్, మరొకరికి షోకాజ్ నోటీసులు
- సంగారెడ్డిలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు
- సమన్వయంతో పనిచేస్తే పన్నుల వసూళ్లలో పురోగతి
- ప్రసవం తర్వాత కుంకుమ పువ్వు తినడం మంచిదేనా?
- మార్చి 2 నుంచి ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల