National
- Jan 05, 2021 , 01:27:24
2020 మండిపోయింది!

1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన 8వ సంవత్సరం
న్యూఢిల్లీ, జనవరి 4: దేశంలో 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఎనిమిదో సంవత్సరంగా 2020 నిలిచిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. అయితే 2016తో పోలిస్తే 2020లో చాలా తక్కువగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వివరించింది. గతేడాది దేశవ్యాప్తంగా భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు సాధారణం (1981-2010 డేటాను అనుసరించి) కంటే 0.29 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. అదే 2016లో 0.71 డిగ్రీలు అధికంగా నమోదైనట్టు పేర్కొంది. 1901 తర్వాత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్-15 సంవత్సరాల్లో 12.. 2006-20 మధ్యనే ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది.
తాజావార్తలు
- గ్రేటర్ ఓటర్లు.. 87.65 లక్షలు
- ఆ సీక్రెట్ ప్లేస్‌ను.. పసిగట్టలేకపోయారు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
- కల్యాణ వైభోగమే..
- టీకా.. వేశాక అరగంట అక్కడే
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
MOST READ
TRENDING