మంగళవారం 19 జనవరి 2021
National - Dec 26, 2020 , 03:03:16

మోదీవన్నీ అబద్ధాలే

మోదీవన్నీ అబద్ధాలే

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ప్రజలను కేంద్రంలోని మోదీ సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రైతుల సమస్యలపై టీవీ ప్రసంగాల్లో ఆవేదన వ్యక్తం చేసే ప్రధాని.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటిని పరిష్కరించేందుకు ముందుకు రారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, అర్ధ సత్యాలతో బెంగాల్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పీఎం కిసాన్‌ పథకంపై బీజేపీ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్‌ విమర్శించారు. ‘పీఎం కిసాన్‌ డబ్బులను మమత అడ్డుకున్నదని బీజేపీ అబద్ధాలు చెప్తున్నది.  నగదును రాష్ట్రప్రభుత్వం ద్వారా ఇవ్వాలని మమతా బెనర్జీ కోరారు. కానీ బీజేపీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు’ అని చెప్పారు.