శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 16:23:31

జగన్నాథుడి భక్తులకు శుభవార్త.. డిసెంబర్‌లో పూరీ ఆలయ ద్వారాలు

జగన్నాథుడి భక్తులకు శుభవార్త.. డిసెంబర్‌లో పూరీ ఆలయ ద్వారాలు

భువనేశ్వర్‌ : జగన్నాథుడి భక్తులకు పూరీ జగన్నాథుడి ఆలయం శుభవార్త చెప్పింది. డిసెంబర్‌ నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ద్వారాలు తెరవనున్నారు. మార్చిలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనలు పాటిస్తూ ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. దాదాపు ఎనిమిది నెలలుగా ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు.


ఆలయంలో అర్చకులతో పాటు స్వామి వారి సేవకులు పెద్ద ఎత్తున వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించడంతో మూసే ఉంచారు. స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. నాలుగు వారాల తర్వాత ఆలయాన్ని తిరిగి తెరుస్తామని, ఇందుకు మూడంచెల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు డాక్టర్‌ క్రిషన్‌కుమార్‌ తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీ, ఆరోగ్య అధికారులతో కూడిన పరిపాలన కమిటీ భక్తులను ప్రవేశానికి సంబంధించి మార్గనిర్దేశనం చేస్తుందని చెప్పారు.


పరిపాలన కమిటీ ప్రతిపాదనలు రూపొందించి.. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుందని చెప్పారు. ఈ అంశంపై ఈ నెల 21న సమావేశం జరుగుతుందని చెప్పారు. పూరి రాజు గజపతి దిబ్యాసింగ్‌ దేబ్‌ అధ్యక్షతన మంగళవారం వార్షిక సమావేశం జరిగిందని, ఆలయ సంస్థ రూ.154 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు డాక్టర్‌ కుమార్‌ తెలిపారు. ఆలయం మూసివేయడంతో ఆదాయం ప్రభావితమవుతోందని, త్వరలో ఆన్‌లైన్‌లో విరాళాలు ఆహ్వానించడం ఆదాయాన్ని పెంచే ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.