మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 13:57:14

శ్రీవారిని దర్శించుకున్న విశాఖశారద పీఠం పీఠాధిపతి

శ్రీవారిని దర్శించుకున్న విశాఖశారద పీఠం పీఠాధిపతి

తిరుపతి : తిరులమ శ్రీవారిని విశాఖశారద పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. విశాఖ ఉత్తరాధిపతి స్వాత్మనంద సరస్వతితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కరోనా సమయంలో స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయల ప్రకారం శ్రీ భూవరహా స్వామి వారి‌ని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద స్వరూపానందేంద్ర స్వామి వారికి అర్చకులు, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఇస్తీకఫల్ స్వాగతం పలికారు.

రెండు రోజుల పర్యటన నేపథ్యంలో నిన్న తిరుమల వచ్చిన ఆయన ఆలయం అభిముఖంగా ఉన్న నాదనీరాజన వేదిక పై జరిగిన భగవద్గీత పఠనంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇతర టీటీడీ అధికారుల పాటు పాల్గొన్నారు. స్వామి వారి దర్శించుకున్న తరువాత ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని కరోనా కారణంగా ఈ ఏడాది దర్శించుకోలేనని భావించానని అయితే స్వామి వారి కృపతో దర్శన భాగ్యం లభించిందని సంతోషం వ్యక్తం చేసారు. కరోనా నుంచి లోకాన్ని రక్షించమని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తిరుమలలో సుందరకాండ పారాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణ కార్యాక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని తెలిపారు.