మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Aug 29, 2020 , 01:48:46

అత్యాధునికంగా ప్రజాభద్రత

అత్యాధునికంగా ప్రజాభద్రత

  • బీపీఆర్డీ డేలో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ: దేశప్రజల రక్షణకు అత్యాధునిక విధానంలో ప్రభావవంతమైన, సున్నితమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్డీ) 50వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ నార్త్‌ బ్లాక్‌లో శుక్రవారం నిర్వహించిన వెబినార్‌కు ప్రధాని తన సందేశాన్ని పంపారు. 50 ఏండ్లుగా దేశ భద్రతకు బీపీఆర్డీ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని కొనియాడారు. ఈ వెబినార్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జన్‌ధన్‌ గేమ్‌ చేంజర్‌

దేశంలో పేదరిక నిర్మూలనలో జన్‌ధన్‌ పథకం గేమ్‌చేంజర్‌గా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. జన్‌ధన్‌ ఆరో వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ట్వీట్‌ చేస్తూ.. ఈ పథకం కింద ఇప్పటివరకు 40 కోట్లకుపైగా బ్యాంకు ఖాతాలు తెరిచారని, వీటిల్లో రూ.1.3 లక్షల కోట్లు జమ అయ్యాయని మోదీ తెలిపారు.


logo