సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 11:06:04

మహమ్మారిని జయించిన 110 ఏళ్ల సిద్ధమ్మ

మహమ్మారిని జయించిన 110 ఏళ్ల సిద్ధమ్మ

చిత్రదుర్గ : కరోనా మహమ్మారితో జరిగిన పోరులో 110 సంవత్సరాల వృద్ధురాలు జయించింది. వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన ఐదు, ఆరు రోజుల్లోనే కొలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యింది. చిత్రదుర్గ జిల్లా సర్జన్‌ డాక్టర్‌ బసవరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 110 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధురాలు సిద్ధమ్మ జూలై 27న వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. ఆమె బలహీనంగా కనిపించినా తక్కువ సమయంలో మహమ్మారి బారి నుంచి కోలుకొని, శనివారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం కర్ణాటకలో కొత్తగా 5,172 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 98 మంది వైరస్‌తో మరణించారు. కాగా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,29,287కు చేరగా, 73,219 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరో 53,648 మంది డిశ్చార్జి కాగా, మహమ్మారితో మొత్తం 2,412 మంది చనిపోయారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo