శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Aug 01, 2020 , 15:41:12

విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి : యూజీసీ

విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి : యూజీసీ

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో వాయిదా వేసిన పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా మళ్లీ వాయిదా పడవచ్చని భావించొద్దని, రాసేందుకు సన్నద్ధం కావాలని యూజీసీ సూచించింది. సెప్టెంబర్‌లో తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది తీర్పును శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.  పిటిషనర్లలో ఒకటి తరఫున హాజరైన అభిషేక్‌ మను సింఘ్వీ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే ఆప్షన్‌తో సహా పరీక్షలు నిర్వహించేందుకు యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు ఏకపక్షంగా ఉన్నాయని వాదించారు.

పలు విశ్వ విద్యాలయాల్లో ప్రాథమిక సదుపాయాలు లేవని, అందువల్ల ఆన్‌లైన్‌ పరీక్షలు ఏకరీతిగా నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ‘ఆప్షనల్‌ ఎగ్జామ్‌ సమస్యాత్మకంగా ఉంటుంది. ఎవరైనా హాజరుకాలేకపోతే.. తర్వాత ఆప్షన్‌ ఇస్తే అది గందరగోళం సృష్టిస్తుంది’ అని కోర్టు చెప్పింది. ‘కానీ ఇది విద్యార్థుల ప్రయోజనం కోసమే’నని పేర్కొంది. అనంతరం సింగ్వీ వాదిస్తూ ‘పరీక్షలు రద్దు చేస్తే స్వర్గం ఊడిపడదు’ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించే విపత్తు నిర్వహణ చట్టంలోని విభాగాలను ప్రస్తావించారు.

రాష్ట్రంలో నడుస్తున్న కళాశాలలకు తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని రికార్డులో నమోదు చేయాలని కోర్టు కోరింది. అలాగే శివసేనకు చెందిన విద్యార్థి విభాగం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. యూజీసీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తోందని, కరోనా సంక్రమణ నేపథ్యంలో పరీక్షలు రాయాలని ఒత్తిడి చేయడం భద్రతపై ఆందోళన చెందుతున్నారన్నారు. కాగా, పరీక్షలపై తన వైఖరిని స్పష్టం చేయాలని హోంశాఖను కోర్టు కోరింది.

ఈ నెల ప్రారంభంలో తుది సంవత్సరం పరీక్షలు రాయవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల ౩వ తేదీ నాటికి సమాధానం ఇస్తామని కేంద్రం తెలిపింది. అయితే విద్యార్థులంతా పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పకనే చెప్పారు. ‘సోమవారం నాటికి ఏం ఎవరం సిద్ధం కాలేం అనే అభిప్రాయంతో ఉండకూడదు.. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహత అన్నారు. పిటిషనర్లలో మరొకరు బీహార్‌లో వరదలు పరీక్షల నిర్వహణను కష్టతరం చేశాయని, మధ్యంత ఉత్తర్వులు జారీ చేయాలని వాదించగా, కోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాలని విమర్శలు ఎదుర్కొంటున్న యూజీసీ.. శుక్రవారం ‘తన నిర్ణయం ఏకపక్షం కాదని, రద్దు కోసం కొన్ని రాష్ట్రాలు పిలుపునివ్వడం ప్రమాణాలను ప్రభావితం చేస్తుంది’ అని పేర్కొంది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo