మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 14:25:28

హర్యానాలోనే సచిన్‌ పైలట్‌ బస : కాంగ్రెస్‌ నేత పీఎల్‌ పూనియా

హర్యానాలోనే సచిన్‌ పైలట్‌ బస : కాంగ్రెస్‌ నేత పీఎల్‌ పూనియా

లక్నో : రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పర్యవేక్షణలో హర్యానా హోటల్‌ బస చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీఎల్‌ పూనియా ఆదివారం ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ చేస్తోంది.  సచిన్‌ పైలట్‌, ఆయన శిబిరంలోని ఎమ్మెల్యేలు హర్యానా హోటల్లో బస చేస్తున్నారు. బయటి వారిని కలిసేందుకు అనుమతించడం లేదు. బీజేపీ పర్యవేక్షణలో అక్కడే ఉంటున్నారు’ అని అన్నారు.  ఇదిలా ఉండగా రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంలో తమ పాత్ర లేదని, ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచారన్న వ్యాఖ్యలను  హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఖండించారు. అసెంబ్లీ సమావేశం విషయమై గెహ్లాట్‌, గవర్నర్‌ కల్ రాజ్‌మిశ్రా మధ్య జరుగుతున్న చర్చలపై పూనియా మాట్లాడుతూ అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్‌ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo