శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:29

కోలుకుంటున్న భారత్‌ 63.45 శాతానికి పెరిగిన రికవరీ

కోలుకుంటున్న భారత్‌ 63.45 శాతానికి పెరిగిన రికవరీ

న్యూఢిల్లీ, జూలై 24: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాధినుంచి కోలుకుంటున్నవారి శాతం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. అదే సమయంలో మరణాల రేటు కూడా తగ్గుతుండటం ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నది. వరుసగా మూడో రోజు కూడా రికవరీ రేటు పెరిగింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 34,602మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దాంతో దేశంలో కరోనా రికవరీ రేటు 63.45కు చేరింది. మరణాల రేటు 2.38కి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. గురువారం నుంచి శుక్రవారం వరకు 24గంటల్లో 49,310 కొత్త కేసులు నమోదయ్యాయి. 740మంది మరణించారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 12.87లక్షలకు  చేరింది. 8,17,208మంది వ్యాధినుంచి కోలుకోగా, 4,40,135మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 30,601కి చేరింది. కాగా, జనాభా పరంగా చూస్తే ప్రపంచంలో భారత్‌లోనే కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ పునరుద్ఘాటించారు. ప్రతి పది లక్షల మందిలో కేవలం 864మందే వ్యాధిబారిన పడుతున్నారని, అందులో కేవలం 24మంది మాత్రమే మరణిస్తున్నారని మంత్రి వెల్లడిచారు.


logo