ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 02:43:10

ప్రపంచం కోసం రిస్క్‌కు సిద్ధపడ్డా!

ప్రపంచం కోసం రిస్క్‌కు సిద్ధపడ్డా!

  • ఆక్స్‌ఫర్డ్‌ ట్రయల్స్‌లో ప్రవాస భారతీయుడు

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ఫార్మా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు దీపక్‌ పాలివాల్‌ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో వలంటీర్‌గా ఉన్నారు. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అర్హత సాధించిన వెయ్యి మందిలో ఆయన  ఒకరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యతిరేకించినప్పటికీ, ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి అంతం అవ్వడానికి తాను జీవితం కోల్పోయినా ఫర్వాలేదని ఏప్రిల్‌ 16న జరిగిన రెండో దశ ట్రయల్స్‌లో ఆయన పాల్గొన్నారు. ‘ట్రయల్స్‌లో పాల్గొనేముందు చాలా మంది నన్ను భయపెట్టారు. భవిష్యత్‌లో సంతాన సమస్యలు ఏర్పడవచ్చన్నారు. కదలికలను గుర్తించేందుకు వాళ్లు (పరిశోధకులు) శరీరంలో చిప్‌ పెడుతారని చెప్పారు. అయితే నేను ఇవేమీ పట్టించుకోలేదు. కరోనా పంజా నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి నా జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధమయ్యా’ అని తెలిపారు. 


logo