బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:54:06

అగర్తలాకు తొలి కార్గో షిప్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి సుఖ్ మాండవీయ

 అగర్తలాకు తొలి కార్గో షిప్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి సుఖ్ మాండవీయ

ఢిల్లీ : కోల్ కతా ఓడరేవు నుంచి అగర్తలాకు తొలి ప్రయోగాత్మక సరకు రవాణా నౌకను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్.సుఖ్ లాల్ మాండవీయ గురువారం ప్రారంభించారు. ఈ నౌక బంగ్లాదేశ్ లోని చటగావ్ ఓడరేవు ద్వారా ప్రయాణిస్తుంది. ఆన్ లైన్ ద్వారా నౌక ను ప్రారం భించారు. భారతదేశానికి చెందిన సరకు రవాణా నౌకలు బంగ్లాదేశ్ ద్వారా జరిపే సముద్రయానానికి చటగావ్, మోగ్లా ఓడరేవులను వినియోగించుకోవాలన్న ఒప్పందం మేరకు ఈ నౌకను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ,..ఈ సముద్రమార్గం ఉభయదేశాలకు కొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని అన్నారు. బంగ్లాదేశ్ ద్వారా ఈశాన్య భారత ప్రాంతానికి మరింత దగ్గరి దారిలో చేరేందుకు ఇది అనుసంధానంగా ఉపయోగపడుతుందని చెప్పారు. భారతదేశానికి చెందిన సరకులను చటగావ్, మోంగ్లా రేవుల ద్వారా రవాణా చేసేందుకు తీసుకున్న ఈ చర్య చారిత్మాత్మకమైనదని, భారత, బంగ్లాదేశ్ సముద్రయాన సంబంధాల్లో ఇది కొత్త అధ్యాయం కాగలదని మంత్రి మాండవీయ చెప్పారు. 


logo