సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 22:59:08

సేవల విస్తరణ లో అజినోమోటో

సేవల విస్తరణ లో అజినోమోటో

బెంగళూరు : జపనీస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సీజనింగ్‌ కంపెనీ అజినోమోటో గత 110 సంవత్సరాలుగా మార్కెట్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుండటంతో పాటుగా తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా 130కు పైగా దేశాలలో విక్రయిస్తుంది. భారతదేశంలో గత 15 సంవత్సరాలుగా ఇది కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రధానంగా తమిళనాడు మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో 70వేలకు పైగా ఔట్‌లెట్ల ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తు న్నది. అంతేకాకుండా దీనికి  కంపెనీ సొంతంగా నిర్వహించే 11 డిపోలు, 120 మంది పంపిణీదారులు తమిళనాడులో ఉన్నారు.

ప్రస్తుతం తన సేవలను తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక తోపాటు  ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో విస్తరించడానికి సిద్ధమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీకి 30 మంది డిస్ట్రిబ్యూటర్లు , 6వేలకు పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. కర్నాటకలో కంపెనీ ఇప్పటికే 11 మంది డిస్ట్రిబ్యూటర్లును నియమించడంతో పాటు10వేలకు పైగా ఔట్‌లెట్ల కవరేజీ కలిగి ఉన్నది. తెలంగాణాలో లో సైతం  ఏడుగురు డిస్ట్రిబ్యూటర్లను కలిగి ఉండటంతో పాటుగా 2వేల మంది రిటైలర్ల కవరేజీని కలిగి ఉన్నది. "భారతదేశంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తో పాటు యుఎస్‌ఎఫ్‌డీఏ, ఫుడ్‌ సేఫ్టీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు అనుమతించాయి.

ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో గానీ, స్థానికంగా తయారుచేసిన నకిలీ ఉత్పత్తులు తప్పుడు లేబుల్స్‌తో రాజ్యమేలుతున్నాయి. వినియోగదారులు ఈ తరహా నకిలీ ఉత్పత్తుల పట్ల పూర్తి ఆప్రమత్తంగా ఉండటంతో పాటుగా  కేవలం అసలైన ఎంఎస్‌జీ మాత్రమే ఉపయోగించాలి. ‘‘తమ వంతుగా , తాము సైతం ఈ తరహా నకిలీ ఉత్పత్తులను మార్కెట్‌ నుంచి పూర్తిగా తొలగించేందుకు తగిన ప్రయత్నాలను చేస్తున్నాం’’ అని అజినోమోటో ఇండియా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అత్య్సుషి మిషుకు అన్నారు.


logo