ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 21:32:15

'జియో'‌లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది

'జియో'‌లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది

ఢిల్లీ : భారతదేశంలో స్మార్ట్ ఫోన్ లేని ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో భాగస్వాములు కావడం గొప్పగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్‌లో గూగుల్ రూ. 33, 737 కోట్ల పెట్లుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడితో గూగుల్ దాదాపు 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనున్నది. జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని అంబానీ వివరించారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని పిచాయ్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైషన్ ఫండ్‌లో తొలి విడతగా రిలయన్స్‌లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని..ఇది తమకు చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్‌ లేని లక్షలాది మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో తాము భాగస్వాములం కావడం గొప్పగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.  



logo