శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 21:08:28

భారత పరిజ్ఞానంతో "పల్స్ ఆక్సీమీటర్లు "

  భారత పరిజ్ఞానంతో

ఢిల్లీ : బయోమెడికల్ రీసెర్చ్ ఇంజనీర్ జినాంగ్ ధామి స్థాపించిన మిటోకాన్ బయోమెడ్, భారతదేశ పరిజ్ఞానం తో "పల్స్ ఆక్సిమీటర్"‌ను తయారు చేసింది. దీనిని "ఆక్సిసాట్" పేరుతో సరసమైన ధరకు అందించేందుకు సిద్ధమైంది. దీనికి 18 నెలల వారంటీ కూడా అందించనున్నారు . చైనా-భారత్ ఉద్రిక్తతల కారణంగా పల్స్ మీటర్ల దిగుమతులు ఆగిపోయాయి. దీంతో ఇండియాలోని తయారీ సంస్థలు వీటిని తయారు చేయడానికి ముందుకొచ్చాయి. పల్స్ ఆక్సిమీటర్లకు డిమాండ్ ఉండడంతో వాటి ధర రూ .3000 నుంచి 4000 రూపాయలకు పెరిగింది. వైద్య పరికరాల పరిశ్రమలో దిగ్గజ సంస్థ మిటోకాన్ బయోమెడ్ తయారు చేసిన పల్స్ ఆక్సిమీటర్ ను "ఆక్సిసాట్ "పేరుతో  విడుదల చేసింది.

రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్లను ఉపయోగిస్తారు. కరోనా లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే తెలుసుకోవడానికి ఈ పరికరం ఎంతగానో ఉపకరిస్తుంది. డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ పరికరాన్ని"సురక్ష కవాచ్" గా అభివర్ణించారు.ఇటీవల, నాణ్యమైన పల్స్ ఆక్సిమీటర్లకు డిమాండ్ పెరిగినప్పటి నుండి, చాలా మంది అమ్మకందారులు , దిగుమతిదారులు చౌకగా ,నాణ్యత పరికరాలను దిగుమతి చేసుకుంటున్నారు, అక్కడ వారు వాటిని బ్రాండ్ చేసి ప్రామాణికమైన "ఇండియా-మేడ్" పల్స్ ఆక్సిమీటర్లుగా విక్రయిస్తున్నారు. "ఏదైనా ఉత్పత్తికి - ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణకు నాణ్యత ప్రధాన ప్రమాణం. ఇదే మిటోకాన్ బయోమెడ్  ఉద్దేశ్యం. మా పల్స్ ఆక్సిమీటర్లు పంపిణీకి వెళ్ళే ముందు నాణ్యతను పరీక్షిస్తాం, ఇవి దిగుమతి చేసుకున్న వాటికంటే నాణ్యంగా ఉన్నాయని జినాంగ్ ధామి ప్రతినిధి తెలిపారు. 


logo